Post Top Ad

Post Top Ad

news

ఇంత చిన్న వయసుకే ఇన్ని అబద్దాలు, ఇన్ని పాపాలా లోకేష్?- పేర్ని నాని


[ad_1]

డ్రైనేజీకి చంద్రబాబు నోటికి తేడా లేకుండా పోయిందన్నారు మంత్రి పేర్ని నాని. వెనక్కు వెళ్లి చూస్తే చంద్రబాబు బతుకేందో తెలుస్తుందన్నారు. వైఎస్‌ఆర్‌ ఉచిత విద్యుత్ ఇస్తామంటే… విద్యుత్ తీగలపై బట్టలారేసుకోవాలని ఎద్దేవా చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.

వ్యవసాయం దండగా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. వరుసగా కరువుతో అల్లాడుతూ, విద్యుత్ చార్జీలు పెంచితే భరించలేమని నిరసన తెలిపిన వారిని గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపించిన చంద్రబాబు ఇప్పుడు అసత్యాలు చెబుతూ మాట్లాడుతున్నారని పేర్ని నాని విమర్శించారు.

ప్రజలకు మతిమరపు అనుకుంటున్నారో లేక చంద్రబాబే భ్రమలో ఉన్నారో కానీ… అన్నీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబుతో పోటీ పడుతూ నారా లోకేష్‌ కూడా పచ్చి అబద్దాలు చెబుతున్నారని.. నారా లోకేష్‌ మరీ బరితెగించి అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కరోనా వస్తే చచ్చిపోతాం… కనీసం మరో 300ఏళ్లు బతకాలని హైదరాబాద్‌లోని రాజప్రసాదంలో అయ్యాకొడుకు దాక్కుని సిగ్గుఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి 970 కోట్ల రూపాయలు చెల్లించకుండా బకాయి పెట్టి వెళ్లిపోయిందన్నారు. సివిల్ సప్లయర్స్‌ కార్పొరేషన్‌ పేరుతో వేల కోట్లు అప్పులు తెచ్చి ఎన్నికల సమయంలో పప్పులు- బెల్లాలకు మళ్లించి వెళ్లిపోయారన్నారు.

నారా లోకేష్‌ ఆడుతున్న పచ్చి అబద్దాలు చూస్తుంటే చంద్రబాబే నయం అనిపిస్తోందన్నారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం అడ్డుకుంటున్న పాపం తండ్రికొడుకులది కాదా… 30లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందకుండా కోర్టుల్లో అడ్డుకుంటున్నది మీరు కాదా అని ప్రశ్నించారు.

రైతుల ఉచిత విద్యుత్‌కు సంబంధించి 8వేల కోట్ల రూపాయలను చంద్రబాబు బకాయి పెట్టివెళ్తే దాన్ని తీర్చిన ఘనత జగన్‌మోహన్ రెడ్డిది అని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో బూతుల సంస్కృతి తెచ్చిందే చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ఇదే దేవినేని ఉమక్కాయ్ అసెంబ్లీ వేదికగా హేయ్‌ జగన్‌ రెడ్డి రాస్కో అనలేదా… మరోనేత అదే అసెంబ్లీలో నీకు మగతనం ఉందా అంటూ జగన్‌ను దూషించలేదా అని పేర్ని నాని ప్రశ్నించారు.

2014లో అధికారంలోకి వచ్చేందుకు 87వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 15వేల కోట్లు కూడా మాఫీ చేయకుండా రైతులను మోసం చేశారని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్‌ విషయంలో జగన్‌మోహన్ రెడ్డి రాజీ పడే ప్రసక్తే లేదని…రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడనివ్వబోమన్నారు.

Previous articleకరోనాకు మనుషులను చంపేంత శక్తి లేదు – ఈటెల

Source link
[ad_2]

source https://earn8online.com/index.php/86234/%e0%b0%87%e0%b0%82%e0%b0%a4-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b5%e0%b0%af%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%87-%e0%b0%87%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%85%e0%b0%ac/

Related Posts

No comments:

Post a Comment

Post Bottom Ad