Post Top Ad

Post Top Ad

news

ముందు మీ నాన్నను ఓదార్చు లోకేష్‌ – కన్నబాబు


[ad_1]

రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ల పట్టాల యజ్ఞాన్ని అడ్డుకుంటున్న రాక్షసులు టీడీపీ నేతలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. కోర్టు కేసులతో టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ పేదలు ఇల్లు కట్టుకోవాలంటే అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, ఒకవేళ స్థలం ఇచ్చినా ఇల్లు మంజూరు కాదని, ఇల్లు మంజూరు అయితే బిల్లులు ఇవ్వరని అన్నారు. అలాంటి పరిస్థితుల్ని మార్చేసిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందని చెప్పారు కన్నబాబు.

ఇళ్ల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా కాకినాడ సిటీలో స్థలం కొనుగోలు అనేది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా చేయలేనిదని అలాంటిది బీచ్‌ రోడ్డులో, కాకినాడ పరిసరాల్లో వందలాది ఎకరాలు సేకరించి పేదలకు ఇస్తున్నామని చెప్పారు.

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెతలాగా చంద్రబాబు, లోకేశ్ తీరు ఉందన్నారు. సద్విమర్శలు తీసుకుంటాం కానీ, తప్పుడు ఆరోపణలు పట్టించుకోబోమని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలతో ఇప్పటికే టీడీపీ 23 సీట్లకు పడిపోయిందని.. బాబు, లోకేశ్ తీరు మారకపోతే వచ్చే దఫా ఎన్నికల్లో రెండో మూడో సీట్లు మిగులుతాయని ఎద్దేవా చేశారు.

ప్రజల దృష్టి మరల్చడానికే రోజుకో నిరసన కార్యక్రమం…

రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతోందంటూ టీడీపీ చేపడుతున్న నిరసన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు మంత్రి కన్నబాబు. గత ఐదేళ్లలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని చంద్రబాబు, లోకేష్.. ఇప్పుడు రైతు ఆత్మహత్యల పేరుతో డ్రామాలాడుతున్నారని, టీడీపీ నేతలకు సిగ్గులేదని విమర్శించారు.

జగన్ అధికారంలోకి వచ్చాక, నేషనల్ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ఆధారంగా ఆత్మహత్యలు చేసుకున్న 480 మంది రైతులకు పరిహారం ఇచ్చామని గుర్తు చేశారు. పరిహారం ఇస్తున్నా, పెట్టుబడి సాయం చేస్తున్నా, వడ్డీలేని రుణాలు ఇప్పిస్తున్నా.. టీడీపీకి కడుపుమంటగా ఉందని అన్నారు కన్నబాబు. యజ్ఞంలా జరుగుతున్న ఇళ్లపట్టాల కార్యక్రమాన్ని పక్కదారి పట్టించటానికి, ప్రజల దృష్టిని మరల్చటానికి రకరకాల కార్యక్రమాలతో టీడీపీ నేతలు రోడ్డెక్కుతున్నారని అన్నారు.

బాబు, లోకేష్ ఒకరినొకరు ఓదార్చుకోవాలి…

లోకేష్ ఇంటింటికి వెళ్లి ప్రజల్ని ఓదారుస్తారని అంటున్నారని, అసలు లోకేశ్ ఓదార్చాల్సింది వాళ్ల నాన్న చంద్రబాబునని అన్నారు. చంద్రబాబు లోకేశ్ ని, లోకేశ్ చంద్రబాబుని ఒకరినొకరు ఓదార్చుకోవాలని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో భవిష్యత్తులో టీడీపీకి ఓట్లు పడవని, అందుకే వారు ఒకరికోసం ఒకరు ఓదార్పు యాత్ర చేసుకోవాలని సూచించారు.


Source link
[ad_2]

source https://earn8online.com/index.php/169551/%e0%b0%ae%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b1%81-%e0%b0%ae%e0%b1%80-%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%a8%e0%b1%81-%e0%b0%93%e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b1%81/

Related Posts

No comments:

Post a Comment

Post Bottom Ad