[ad_1]
ఎట్టకేలకు దేవిశ్రీప్రసాద్, సిద్ శ్రీరామ్ కలిశారు. వీళ్లిద్దరి కాంబోలో ఓ పాట వస్తే వినాలని చాలామంది
శ్రోతలకు ఉంది. ఆ కోరిక ఇవాళ్టితో తీరిపోయింది. రంగ్ దే సినిమా నుంచి దేవిశ్రీప్రసాద్ కంపోజిషన్ లో
సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విడుదలైంది.
పాటకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు.
అందరి అంచనాలకు తగ్గట్టే పాట అదిరిపోయింది. “నా కనులు ఎపుడూ కననే కనని” అనే లిరిక్స్ తో సాగే
ఈ పాట విన్న వెంటనే మనసుకు హత్తుకుంటుంది.
కచ్చితంగా రంగ్ దే సినిమాలో హిట్ సాంగ్ ఇదే. ఇప్పటికే ఈ సినిమా నుంచి 2 పాటలు మార్కెట్లోకి
వచ్చినప్పటికీ.. ఈ పాటే సినిమాకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారబోతోంది. నితిన్-కీర్తిసురేష్
హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ నెల 26న థియేటర్లలోకి రాబోతోంది.
Source link
[ad_2]
source https://earn8online.com/index.php/217918/%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%a6%e0%b1%87-%e0%b0%ae%e0%b1%86%e0%b0%b2%e0%b1%8a%e0%b0%a1%e0%b1%80-%e0%b0%b8%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%85%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b0/
No comments:
Post a Comment