[ad_1]
ఎన్నో రోజుల ఉత్కంఠకు తెరపడింది. రేవంత్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ఏఐసీసీ ప్రకటించింది. పీసీసీ అధ్యక్షుడితో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులను, ఉపాధ్యక్షులను సైతం ఏఐసీసీ నియమించింది. మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్‌ను ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించింది.
మహ్మద్ అజహరుద్దీన్, జే గీతారెడ్డి, ఎం అంజన్ కుమార్ యాదవ్, టీ జగ్గారెడ్డి, బీ మహేశ్ కుమార్ గౌడ్లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు.
చంద్రశేఖర్ సంబాని, దామోదర్‌రెడ్డి, మల్లు రవి, పొదెం వీరయ్య, సురేశ్ షెట్కర్, వేం నరేందర్‌రెడ్డి, రమేశ్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, టీ కుమార్ రావు, జావేద్ అమీర్లను సీనియర్ ఉపాధ్యక్షులుగా నియమించారు. ప్రచార కమిటీ కన్వీనర్‌గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీలను ఎంపిక చేసింది. ఎన్నికల మేనేజ్మెంట్ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహను ఎంపిక చేసింది.
ఏఐసీసీ ప్రోగ్రామ్ అమలు కమిటీ చైర్మన్‌గా అల్లేటి మహేశ్వర్‌రెడ్డిని నియమించింది. పీసీసీ అధ్యక్షుడి నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉండిపోయింది. కాంగ్రెస్ సీనియర్ కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించాయి. చివరకు అధిష్ఠానం రేవంత్‌వైపే మొగ్గుచూపింది. ఉమ్మడి పాలమూరు జిల్లా.. ప్రస్తుత నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో రేవంత్‌రెడ్డి జన్మించారు. ఆయన తొలుత టీఆర్ఎస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రేవంత్‌రెడ్డికి గొప్ప వాగ్దాటి సొంతం. ఆయనకు దూకుడు కూడా ఎక్కువే. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ లాంటి బలమైన పార్టీని ఢీకొట్టాలంటే రేవంత్‌రెడ్డే సరైన నేత అని కాంగ్రెస్ హైకమాండ్ భావించినట్టు ఉంది. అయితే రేవంత్‌రెడ్డిపై అనేక విమర్శలు సైతం ఉన్నాయి. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఓటు కు నోటు కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.
Source link
[ad_2]
source https://earn8online.com/index.php/297278/%e0%b0%aa%e0%b1%80%e0%b0%b8%e0%b1%80%e0%b0%b8%e0%b1%80-%e0%b0%85%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%81%e0%b0%a1%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%b0%e0%b1%87%e0%b0%b5%e0%b0%82/
No comments:
Post a Comment