[ad_1]
రీసెంట్ గా పెళ్లి చేసుకుంది కాజల్. పదేళ్లుగా పరిచయమున్న ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును ఆమె వివాహమాడింది. తక్కువమంది బంధువుల మధ్య ఘనంగా జరిగిన ఈ పెళ్లిలో డిజైనరీ దుస్తుల్లో కాజల్ మెరిసిపోయింది. మరి ఆ డిజైనరీ దుస్తుల వెనక ఎంత కష్టం ఉందో మీకు తెలుసా..?
పెళ్లిలో కాజల్ వేసుకున్న పింక్ కలర్ లెహెంగా తయారీకి నెల రోజులు టైమ్ పట్టిందట. అది కూడా 20 మంది వర్కర్లు నిర్విరామంగా పనిచేస్తే, నెల రోజుల్లో ఆ లెహెంగా పూర్తయిందట. ఈ విషయాన్ని డిజైనర్ అనామికా ఖన్నా స్వయంగా బయటపెట్టింది. కాజల్ పెళ్లికి దుస్తులు రూపొందింది ఈ డిజైనర్.
కలకాలం గుర్తుండిపోయే పెళ్లి విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని నిర్ణయించుకుంది కాజల్. అందుకే దుస్తుల కోసం లక్షలు ఖర్చుపెట్టింది. 2 రోజుల పాటు జరిగిన వివాహ వేడుకల్లో కాజల్ మొత్తంగా 8 డిజైనరీ గార్మెంట్స్ ధరించిందట.
Source link
[ad_2]
source https://earn8online.com/index.php/129864/%e0%b0%95%e0%b0%be%e0%b0%9c%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b5%e0%b1%86%e0%b0%a8%e0%b0%95-%e0%b0%95%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b0%82-%e0%b0%ae/
No comments:
Post a Comment